ట్రాఫిక్ నిబంధనలపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అయితే కొందరు ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అలాంటి వారిపై బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ఫుట్‌పాత్‌పై వెళ్లే వారిపై కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు.
అలాగే ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. పాదచారుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను అమలు చేశారు. గతంలో ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించేవారు. జరిమానా విధించినప్పటికీ, వాహనదారులు మాత్రమే మళ్లీ ఫుట్‌పాత్‌లపైనే నడుపుతున్నారు.
దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పదే పదే పట్టుబడితే లైసెన్స్ సస్పెండ్ చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. అందుకే ఇక నుంచి ఫుట్‌పాత్‌పై డ్రైవింగ్ చేసే ముందు ఆలోచించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఫుట్‌పాత్‌పై ఎక్కువగా బైక్‌లను నడుపుతున్నట్లు గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు.
రూ.80 లక్షల జరిమానాల వసూలు:
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల ఆపరేషన్ కొనసాగింది. జనవరి 27 నుండి ఫిబ్రవరి 2 వరకు పట్టుబడిన వారి నుంచి వసూలైన మొత్తం రూ. 80 లక్షలు. బెంగళూరులోని 50 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో తనిఖీలు జరిగాయి. గత వారంలో 800 వాహనాలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఎంఎన్ అనుచేత్ తెలిపారు.