అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరే క్రమంలో ఆముదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద వంద రూపాయిలతో పెట్రోల్ కొట్టించాడు. అనంతరం బైక్‌ను స్టార్ట్ చేసే క్రమంలో సెల్ఫ్ ప్రెస్ చేయగా బైక్ స్టార్ట్ కాలేదు. దాంతో బైక్‌ను కాస్త ముందుకు తీసుకువెళ్లి కిక్ కొట్టి స్టార్ట్ చేయగా ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి. అక్కడే బైక్‌కి సైడ్ స్టాండ్ వేసి భయంతో భార్యాభర్తలు పక్కకు పరుగులు పెట్టారు. వెంటనే పెట్రోల్ బంకు సిబ్బంది ప్రమాదాన్ని గమనించి మంటలపై ఇసుకను, అలాగే బకెట్‌తో నీరు జల్లారు. కాసేపటికి మంటలు కంట్రోల్ అయ్యాయి. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పొరపాటున మంటలు పెట్రోల్ బంకు ట్యాంక్‌లకు విస్తరించి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఇటీవల ఎలక్ట్రిక్ బైక్‌లలోని బ్యాటరీలు హీట్ ఎక్కి బైక్ తగలబడటం లేదా బ్యాటరీలు పేలిపోవటం వంటివి తరచూ జరుగుతూ ఉండేవి. అయితే ఈసారి ప్రమాదానికి గురైంది పెట్రోల్ బైక్. దూర ప్రయాణం వల్ల బైక్ ఇంజిన్ హీట్ ఎక్కిపోయి ఉండటం, కిక్ కొట్టే సమయంలో కిక్ రాడ్ వద్ద ఘర్షణ వల్ల నిప్పు రవ్వలు వచ్చి ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అక్కడి వారు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!
Mohammed Siraj: బిగ్ బాస్ బ్యూటీకి మహమ్మద్ సిరాజ్ బౌల్డ్
రోడ్డును ఇలా కూడా నిర్మిస్తారా.. ఆశ్చర్యపోతున్న జనం