
గడియారాన్ని ఉంచే స్థానం, దిశ, రూపం వంటి అంశాలను వాస్తు ప్రకారం పాటించడం అవసరం. ఇంట్లో గడియారం ఉంచే సరైన స్థానం గురించి అలాగే వాస్తు ప్రకారం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గడియారం, సమయ ప్రాముఖ్యత
మన జీవితంలో సమయం సక్రమంగా సాగాలంటే గడియారం సరైన స్థలంలో ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం శుభ సమయంలో నడుస్తూ ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. కానీ తప్పుడు దిశలో ఉంచితే అదృష్టాన్ని తగ్గించవచ్చు.
సరైన దిశలు
- తూర్పు దిశ.. ఇంట్లో గడియారాన్ని ఉంచేందుకు అత్యంత శుభప్రదమైన దిశ. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితి మెరుగుపడతాయి. అదనంగా, ఇంట్లో శుభశక్తులు ప్రవేశిస్తాయి.
- ఉత్తర దిశ..వ్యాపారం, ఉద్యోగ పురోగతి కోరుకునే వారు ఉత్తర దిశలో గడియారాన్ని ఉంచడం మేలు. ఇది కొత్త అవకాశాలు, ఆర్థికాభివృద్ధిని తీసుకురాగలదు.
దూరంగా ఉంచాల్సిన దిశలు
- దక్షిణ దిశ.. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం అనుకూలం కాదు. ఇది దారిద్య్రం, ఆటంకాలను కలిగించే అవకాశాలు ఉన్నాయి.
- పడమటి దిశ.. ఈ దిశలో గడియారం ఉంచితే ఇంట్లో అనారోగ్యం, కుటుంబ కలహాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
ముఖ్యమైన నియమాలు
- పగిలిన గడియారాలు ఇంట్లో ఉంచకూడదు. అవి ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.
- సరిగ్గా పని చేయని గడియారాన్ని వెంటనే రిపేర్ చేయాలి లేదా మార్చాలి.
- గుండ్రటి ఆకారం కలిగిన గడియారం శుభప్రదంగా భావించబడుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది.
- లోలకం ఉన్న గడియారం కూడా మంచి ఫలితాలను అందించగలదు.
ఇంట్లో గడియారం ఎక్కడ ఉంచాలనే విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో ఉంచిన గడియారం అదృష్టాన్ని పెంచి జీవితంలో శుభసమయాలను తీసుకురావడంలో సహాయపడుతుంది. గడియారాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం ఉత్తమం. అలాగే పగిలిన పని చేయని గడియారాలను వెంటనే తొలగించాలి. ఈ చిన్న మార్పులు ఇంట్లో సానుకూల మార్పులను తీసుకురాగలవు.