PM Modi – Elon Musk: ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ భేటీ.. ఆ విషయాలపైనే కీలక చర్చ!

PM Modi – Elon Musk: ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ భేటీ.. ఆ విషయాలపైనే కీలక చర్చ!


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు ప్రముఖులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే.. ప్రధాని మోదీ .. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు.. ఈ బేటిలో మస్క్ తోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ బస చేసిన బ్లెయిర్‌ హౌస్‌లో ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఎంట్రీ, స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలపై చర్చించినట్లు సమాచారం..

ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ భేటీ వీడియో..

అంతకుముందు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్‌ వాల్జ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. NSAతో ఫలవంతమైన సమావేశం జరిగిందని.. మైఖేల్‌వాల్ట్జ్ ఎల్లప్పుడూ భారతదేశానికి గొప్ప స్నేహితుడంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ, సాంకేతికత, భద్రత.. భారతదేశం-యుఎస్ఎ సంబంధాలలో ముఖ్యమైన ఈ అంశాలపై తాము అద్భుతమైన చర్చలు జరిపామన్నారు. AI, సెమీకండక్టర్లు, అంతరిక్షం, మరిన్ని రంగాలలో సహకారానికి బలమైన అవకాశం ఉందని ప్రధాని ఎక్స్ లో షేర్ చేశారు.

కాగా.. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2.30 సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్నారు. మరోవైపు.. సుంకాల విషయంలో ట్రంప్‌ కీలక ప్రకటన చేసిన సమయంలో ఇరువురు భేటీపై ఉత్కంఠ నెలకొంది..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *