ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మమితా బైజు. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇక చిత్రంలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. ప్రేమలు సినిమా రిలీజైన తర్వాత ఆమె పాత వీడియోలు, రీల్స్, డ్యాన్స్ క్లిప్పులు ఒక్కసారిగా నెట్టంట వైరలయ్యాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ దళపత జయ నాయగన్ లో నటిస్తోంది. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన అయినప్పటికీ మమిత రోల్ కు కూడా బాగా ఇంపార్టెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో నూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మమిత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలను అందులో పంచుకుంటుంది. అలా తాజాగా మమిత షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
మమితా బైజు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువకుడితో క్లోజ్‌గా టీ తాగుతూ.. ఐస్ క్రీమ్ తింటూ, బస్సులో వెళ్తూ కనిపించిందీ అందల తార. ‘ నా ప్రాణ స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ వి. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నువ్వు నా జీవితంలోకి అనుకోకుండా సరైన సమయంలో వచ్చిన అరుదైన రత్నానివి’ అని ఎమోషనల్ గా రాసుకొచ్చింది. అంతేకాదు ఈ పోస్టుకు లవ్ ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టంట వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ మమితా బైజు ప్రేమలో పడిందా? అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మమితా బైజు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన వీడియో..
ఈ వీడియోలో మమిత బైజతో ఉన్నది ప్రేమలు సినిమాలో హీరోకు ఫ్రెండ్ గా నటించిన వ్యక్తేనని తెలుస్తోంది. వీరిద్దరి మంచి స్నేహితులని తెలుస్తోంది. అందుకే అతని పుట్టిన రోజు సందర్భంగానే ఈ స్పెషల్ వీడియను షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తమిళ్, మాలయళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది మమిత.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి