Sudigali Sudheer: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్.. అసలు ఏమైంది? అభిమానుల్లో ఆందోళన

Sudigali Sudheer: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్.. అసలు ఏమైంది? అభిమానుల్లో ఆందోళన


జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్. తన కామెడీ పంచులు, ప్రాసలు, యాక్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక యాంకర్ గానూ రాణిస్తూ స్టార్ హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు సుధీర్. సోలో హీరోగా యాక్ట్ చేస్తూనే ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్నాడు. కాగా ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు సుధీర్. తాజాగా అతను ఓ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ ధన రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రామం రాఘవం ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఫిబ్రవరి 17) హైదరాబాద్ లో జరగ్గా సుధీర్ కూడా హాజరయ్యాడు. అయితే అతను డిఫరెంట్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను షాక్ ఇచ్చాడు. గతంలో కంటే బక్క చిక్కి పోయి చాలా నీరసంగా కనిపించాడు. దీంతో సుధీర్ కు ఏమైందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

సుడిగాలి సుధీర్ ఆరోగ్య పరిస్థితిపై ధనరాజ్ స్పందించారు.. ‘సుధీర్ కి ఆరోగ్యం బాగోలేదు. నేరుగా ఆస్పత్రి నుంచి నా కోసం వచ్చాడు. మూడు రోజుల నుంచి తనకి మాట్లాడటానికి మాట కూడా రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగితే కచ్చితంగా వస్తానని చెప్పాడు. ఆరోగ్యం బాగోకపోయినా నా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకున్న వాళ్ళల్లో సుధీర్ ముందు ఉంటాడు. అతనికి చాలా మొహమాటం. ఆఖరికి అతని ఫంక్షన్స్ కు వెళ్లడానికి కూడా ఆలోచిస్తాడు. అలాంటిది నా కోసం వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి కాబట్టి వెంటనే వెళ్లిపోతాడు’ అని చెప్పుకొచ్చాడు.

రామం రాఘవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుడిగాలి సుధీర్..

సుడిగాలి సుధీర్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో అతనిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు సుధీర్‌కు ఏమైంది? ఆస్పత్రిలో ఎందుకున్నాడు? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *