సాఫ్ట్‌వేర్ టూ డ్రగ్స్.. ఓర్నాయనో మస్తాన్ సాయి మామూలోడు కాదు.. ఐఐటీలో ఏం చేశాడో తెల్సా

సాఫ్ట్‌వేర్ టూ డ్రగ్స్.. ఓర్నాయనో మస్తాన్ సాయి మామూలోడు కాదు.. ఐఐటీలో ఏం చేశాడో తెల్సా


గత కొద్దిరోజులుగా మస్తాన్ సాయి వ్యవహారం అందరికీ తెలిసిందే. చాలామంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తుండేవాడు. ఈ విషయంపై తాజాగా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదుపై పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. తాజాగా మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత ఆయన తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడిను కావాలని లావణ్య ఈ కేసులో ఇరికించిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో ఉన్నది కేవలం నలుగురు అమ్మాయిల వీడియోలు మాత్రమేనని వాళ్ళు స్పష్టం చేశారు.

గతంలో మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలని లావణ్య పదేపదే వేధించిందని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లావణ్యతో పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల మస్తాన్ సాయి మీద కక్షతో లావణ్య గతంలోనే గుంటూరులో మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేసింది. అప్పటికే ఆమెకు రాజ్ తరుణ్‌తో వివాహం అయిందని మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా మస్తాన్ సాయి బీటెక్ చదివి ఐఐటి కాన్పూర్‌లో మరో కోర్స్ చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడన్నారు. అక్కడ అతడికి ఉన్నిత్ రెడ్డి అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా లావణ్యతో పరిచయం ఏర్పడిందని మస్తాన్ సాయి తల్లిదండ్రుల తెలిపారు.

గుంటూరులో ఉన్న మస్తాన్ సాయి నివాసానికి వచ్చి లావణ్య హార్డ్ డిస్క్‌ను ఎత్తుకెళ్తున్న దృశ్యాలను మస్తాన్ సాయి తల్లిదండ్రులు మీడియాకు విడుదల చేశారు. ఎవరు ఇంట్లో లేని సమయంలో అక్రమంగా లోపలికి ప్రవేశించి మస్తాన్ సాయి రూమ్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ను లావణ్య దొంగలించిందని వారు ఆరోపిస్తున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో ఉన్నది కేవలం తన మాజీ ప్రియురాలుతో పాటు అతడి భార్య వీడియోలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *