మీరు FASTag ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించి టోల్ దాటే డ్రైవర్లకు సోమవారం నుండి నిబంధనలలో మార్పు చేసింది ప్రభుత్వం. టోల్ ప్లాజాల వద్ద రద్దీ, జాప్యాలను తగ్గించడానికి, ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ వ్యవస్థను అమలు చేసింది. సోమవారం నుండి అమల్లోకి వచ్చిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ నిబంధనలలో మార్పులు చేసింది. ఈ మార్పుల లక్ష్యం టోల్ వసూలును సులభతరం చేయడం, హైవేపై వాహనాల కదలికను ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించడం. నిబంధనలలో మార్పులు ఏమిటో చూద్దాం.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనలలో చేసిన మార్పుల ప్రకారం, మీ ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా లేదా క్లోజ్ చేసినా టోల్ కు వెళ్లే ముందు ఈ విషయాలను పాటించాలి. ఎవరిదైనా ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటే టోల్ బూత్ దాటడానికి 60 నిమిషాల ముందు దానిని రీఛార్జ్ చేసుకోవాలి. డ్రైవర్ అలా చేయడంలో విఫలమైతే, అతను రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలపై ఫాస్ట్‌ట్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి అని గుర్తించుకోండి.
బ్యాలెన్స్ తక్కువగా ఉంటే..
కొత్త నిబంధనల ప్రకారం, ఒక వాహనం FASTag కలిగి ఉన్నప్పటికీ తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉంటే లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే అది టోల్ ప్లాజా గుండా వెళ్ళడానికి అనుమతి ఉండదు. ఒక వ్యక్తి తగినంత బ్యాలెన్స్ లేకుండా టోల్ దాటడానికి ప్రయత్నిస్తే, అతను జరిమానా చెల్లించాల్సి రావచ్చు. టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ సజావుగా ఉండేలా, సమయానికి ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఈ నియమం అమలు చేసింది.
ప్రయాణికుల సౌలభ్యం కోసం NHAI ఒక చిన్న గ్రేస్ పీరియడ్‌ను అందించింది. ఇది డ్రైవర్లు తక్కువ బ్యాలెన్స్ అలర్ట్ అందుకున్నప్పుడు వారి FASTagను సకాలంలో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ చొరవ టోల్ ప్లాజాకు చేరుకునే ముందు తగినంత బ్యాలెన్స్‌ను నిర్ధారించడంలో సహాయపడుతుంది. తద్వారా లావాదేవీ వైఫల్యం, జరిమానాల అవకాశాలను తగ్గిస్తుంది. లావాదేవీలలో జాప్యం సమస్యను కూడా NHAI పరిగణనలోకి తీసుకుంది. టోల్ ప్లాజా దాటిన 15 నిమిషాల్లోపు చెల్లింపు పూర్తి కాకపోతే, ప్రజలు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. సకాలంలో చెల్లింపును నిర్ధారించడానికి, టోల్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నియమం రూపొందించారు. కొత్త ఫాస్ట్ ట్యాగ్ నియమాలు టోల్ వసూలును సులభతరం చేయనుంది. తద్వారా హైవే ప్రయాణికులు ఇబ్బంది లేని ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి