ఈ నెల 28 నుంచి మే 6వ తేదీ వరకు బుధుడు మీన రాశిలో నీచ స్థితి పొందడం జరుగుతోంది. అయితే, శుక్రుడు అదే రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల బుధుడికి నీచ భంగం కలిగింది. బుధుడు ఈ విధంగా నీచభంగం చెందడం వల్ల కొన్ని రాశులకు రాజయోగాలు కలిగించే అవకాశం ఉంది. మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మకర రాశులకు ఈ నీచభంగం వల్ల తప్పకుండా రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. గౌరవమర్యాదలు పెరగడం, ఆర్థిక ఒప్పందాలు కుదరడం, ఆదాయం ప్రయత్నాలు విస్తరించడం, వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభించడం, వ్యాపా రాలు అభివృద్ధి చెందడం వంటివి బుధుడి నీచ భంగం వల్ల చోటు చేసుకునే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో బుధుడి నీచ భంగం వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగి, ఇతర కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి, యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారైనా పైచేయి సాధిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- మిథునం: రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో నీచ భం చెందడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు అనేక శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు కోలుకుంటారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆదాయానికి లోటుండదు.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో బుధుడు నీచభంగం చెందడం వల్ల ధనయోగాలు కలుగుతాయి. ఆక స్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి నుంచి వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అదృష్టం పండుతుంది.
- కన్య: రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో నీచపడినప్పటికీ, ఉచ్ఛ శుక్రుడి కారణంగా నీచ భంగం పొందినందువల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి, అంచనాలను మించిన లాభాలు కలుగు తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో బుధుడు నీచ భంగం చెందినందువల్ల ఆదాయం బాగావృద్ధిచెంది, ఆర్థిక, రుణ సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి పొందే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. దాయాదులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
- మకరం: ఈ రాశికి మూడవ స్థానంలో బుధుడి నీచ భంగ సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. సోదరులతో సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.