ఆమె వయస్సు 22.. బంగ్లాదేశ్‌కు చెందిన యువతి. ఆ ఇద్దరు యువకులకు కూడా సుమారు 24, 26 ఏళ్లు ఉంటాయి. వీరు ముగ్గురు గౌహతిలోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. ఏం చేస్తున్నారో.. ఏమో తెలియదుగానీ.. అర్ధరాత్రి వారు తీసుకున్న రూమ్ నుంచి విచిత్రమైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. ముందుగా హోటల్ సిబ్బంది వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అసలేం జరుగుతోందా.? అని వెళ్లి చూడగా.. వాళ్లు బిత్తరపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ వివరాలు ఇలా..
22 ఏళ్ల బంగ్లాదేశ్ యువతితో పాటు మరో ఇద్దరు స్థానిక యువకులు అడల్ట్ వీడియోలు తీస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు. గౌహతిలో ఈ ఘటన చోటు చేసుకోగా.. వారిని దిస్‌పుర్ పోలిసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఆ ఇద్దరు యువకులను షఫీకుల్, జహంగీర్‌గా గుర్తించారు పోలీసులు. అలాగే బంగ్లాదేశ్‌కు చెందిన ఆ యువతి మీన్ అఖ్తర్‌గా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు ముగ్గురు గౌహతిలోని సూపర్ మార్కెట్ ఏరియాలో ఉన్న ఓ హోటల్‌లు పలు రూమ్స్ బుక్ చేసుకున్నారు. పలువురు అమ్మాయిలను తీసుకొచ్చి.. అక్కడ అడల్ట్ వీడియోలు చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే హోటల్ సిబ్బందికి వారిపై అనుమానం రావడంతో.. గుట్టంతా రట్టయింది.
ఇదిలా ఉంటే.. మీన్ అక్తర్ బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి భారత్‌లో అక్రమంగా చొరబడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆమె దగ్గర ఒరిజినల్ పాస్‌పోర్ట్ లేదా వీసా లేదని తేల్చారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఈ గ్రూప్ మరెక్కడైనా చేస్తున్నారా.? అనే విషయాలు తెలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి