PAK vs NZ: గత సీజన్ విజేత పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. బుధవారం 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. విలియం ఓ’రూర్కే, మిచెల్ సాంట్నర్ తలా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాట్ హెన్రీ 2 వికెట్లు పడగొట్టాడు.
కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 5 వికెట్లకు 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరపున విల్ యంగ్ 107, టామ్ లాథమ్ 126, గ్లెన్ ఫిలిప్స్ 54 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు పడగొట్టాడు. అబ్రార్ అహ్మద్, హరిస్ రవూఫ్ లకు కూడా తలా ఒక వికెట్ దక్కింది.
పాకిస్తాన్ తరఫున ఖుష్దిల్ షా (69 పరుగులు), బాబర్ ఆజం (64 పరుగులు) అర్ధ సెంచరీలు సాధించారు.సల్మాన్ అలీ అఘా 42 పరుగులు, ఫఖర్ జమాన్ 24 పరుగులు చేశారు.
ఇవి కూడా చదవండి
రెండు జట్ల ప్లేయింగ్-11..
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ’రూర్కే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..