ఇటీవల కాలంలో బ్యాంకులు లాకర్లను చాలా మంది ఖాతాదారులకు కేటాయిస్తున్నాయి. ఈ లాకర్స్‌లో కస్టమర్లు తమ విలువైన వస్తువులను సురక్షితంగా నిల్వ చేసుకుంటారు. మీకు బ్యాంకు లాకర్‌ను కేటాయించిన సమసయంలో బ్యాంక్ అధికారలు మీకు ఒక కీని అందిస్తారు. ఒకవేళ మీరు ఆ కీని పోగొట్టుకుంటే తిరిగి మీ లాకర్ తెరవడానికి కొన్ని నిర్ధిష్ట పద్ధతులు ఉంటాయి. మీరు మీ బ్యాంక్ లాకర్ కీని పోగొట్టుకుంటే మీరు వెంటనే బ్యాంకుకు తెలియాలి. అనంతరం మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను కూడా దాఖలు చేయాలి.
అనంతరం కొన్ని బ్యాంకులు మీకు డూప్లికేట్ కీని అందిస్తాయి. కుదరని పక్షంలో మీరు మరో లాకర్‌ను కేటాయిస్తారు. ఆ సమయంలో బ్యాంక్ అసలు లాకర్‌ను పగలగొట్టి దానిలోని వస్తువులను కొత్త లాకర్‌కు బదిలీ చేసి మీకు మళ్లీ కొత్త కీని జారీ చేయవచ్చు. లాకర్ మరమ్మతులు, బ్రేక్-ఇన్ విధానంతో సహా ఈ ప్రక్రియకు సంబంధించిన ఖర్చులన్నీ ఖాతాదారుడే భరించాల్సి ఉంటుంది. సాధారణంగా లాకర్ తెరవవలసి వస్తే లేదా పగలగొట్టవలసి వస్తే, ఆ ప్రక్రియ కస్టమర్, బ్యాంక్ ప్రతినిధి ఇద్దరి పర్యవేక్షణలో చేస్తారు. ఉమ్మడి లాకర్ తీసుకుంటే మాత్రం అందరు సభ్యులు కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ్ల కస్టమర్ అక్కడ ఉండలేకపోతే వారు లేనప్పుడు లాకర్ తెరవడానికి రాతపూర్వక అనుమతి ఇవ్వాలి.
అయితే కస్టమర్ వరుసగా మూడు సంవత్సరాలు లాకర్ అద్దె చెల్లించకపోతే, బకాయిలను తిరిగి పొందడానికి లాకర్‌ను పగలగొట్టే హక్కు బ్యాంకుకు ఉంటుంది. అదనంగా ఒక లాకర్ ఏడు సంవత్సరాలుగా నిష్క్రియంగా ఉంటే, ఈ కాలంలో కస్టమర్ సందర్శించకపోతే, అద్దె చెల్లించినప్పటికీ బ్యాంకు లాకర్‌ను పగలగొట్టవచ్చు. అలాగే లాకర్ హోల్డర్ పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేసి, లాకర్ లో నేరానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తే కస్టమర్ లేకుండానే బ్యాంకు లాకర్ ను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు ఇద్దరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి