
క్రియేటివిటీ ఉండొచ్చు.. కానీ ఆ క్రియేటివిటీ లిమిట్స్ దాటకూడదు. ఇదే రీతిలో యాడ్ అని చెప్పి.. లైట్‌గా ఏకంగా లైన్ మొత్తాన్ని దాటేసింది ఓయో హోటల్స్. దీంతో ఎక్స్‌లో ‘బాయ్‌కాట్ ఓయో’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్ అవుతోంది. కుంభమేళా సందర్భంగా ఓయో సంస్థ ఇచ్చిన ఓ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో ‘దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. అలాగే ఓయో కూడా’ అని పేర్కొనడమే ఇందుకు కారణం. దీంతో నెటిజన్లు దేవుడితో పోల్చడమేంటని ఓయో యాజమాన్యంపై మండిపడుతున్నారు. అలాగే హిందూ సంఘాల ప్రతినిధులు కూడా విరుచుకుపడుతున్నారు. ఓయోను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో
తమ ప్రకటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఓయో సంస్థ యాజమాన్యం దిగొచ్చింది. తాము ఇచ్చిన ప్రకటన కేవలం దేశంలోని ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తప్పితే.. ఏ మతాన్ని ఉద్దేశించి కాదని.. ఎలాంటి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడానికి కాదని స్పష్టం చేసింది.
ఇది చదవండి: భారత్‌లో ‘టెస్లా’ కార్లు ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే
A small platform whose business runs on the money of the people of India,
Today a small company is comparing itself to God. All concerned should openly oppose this stupid organization.#BoycottOYO pic.twitter.com/xPdTy3t52s— Ramurti Holkar (@__Ramholkar) February 21, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి