సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంటలలో సూర్య, జ్యోతిక ఒకరు. ఇద్దరు దక్షిణాదిలో స్టార్ హీరోహీరోయిన్స్. కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదే సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పాప, బాబు ఉన్నారు. సూర్యను పెళ్లి చేసుకోవడానికి ముందు జ్యోతిక టాప్ హీరోయిన్లలో ఒకరు. ముంబైకి చెందిన ఆమె ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన వాలి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో మెప్పించింది. దక్షిణాదిలో అత్యంత బిజీగా ఉండే హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోల సరసన నటించింది. తక్కువ కాలంలోనే నంబర్ 1 నటిగా ఎదిగింది.
సూర్య, జ్యోతిక కలిసి మాయావి, సిల్లును ఒరు కాదల్ వంటి చిత్రాల్లో నటించారు. 2006లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు దూరంగా ఉండిపోయింది. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జ్యోతిక తన 36 ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. విజయ్ దళపతి చిత్రాల్లో నటించేందుకు గతంలో జ్యోతిక నిరాకరించిందంట. ప్రస్తుతం జ్యోతిక తమిళంలోనే కాకుండా మలయాళం, హిందీ భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమెకు హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం జ్యోతిక తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో స్థిరపడింది. ఆమె ఒక్క సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటుంది.
ఇవి కూడా చదవండి
సినిమాలతోనే కాకుండా అటు ప్రకటనల ద్వారా కూడా జ్యోతిక సంపాదిస్తుంది. సంవత్సరానికి రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు సంపాదిస్తుంది. నటనపైనే కాకుండా నిర్మాణంపై సైతం దృష్టి సారిస్తున్నాడు. తన భర్త సూర్యతో కలిసి 2D అనే నిర్మాణ సంస్థ ప్రారంభించారు. నివేదికల ప్రకారం జ్యోతిక రూ.330 కోట్ల ఆస్తులను కలిగి ఉంది. సూర్య కంటే ఆయనకు ఎక్కువ ఆస్తులు ఉండటం గమనార్హం.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..