EPFO: PF ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌! ఇక నుంచి..

EPFO: PF ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌! ఇక నుంచి..


EPFO: PF ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌! ఇక నుంచి..

ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా కలిగిన వారికి త్వరలోనే ఒక చేదు వార్త అందనుంది. అదేంటంటే.. 2025 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు తగ్గించున్నారు. ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం ఉండగా.. 2025 ఆర్థిక ఏడాది గాను 8.25 కంటే కాస్త తగ్గనుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న సమావేశమై రేటును నిర్ణయించనున్నారు. మార్కెట్లు పడిపోవడం, బాండ్ దిగుబడి ఈ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. గత సంవత్సరం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2024 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అంతకు ముందు ఏడాది 8.15 శాతంగా ఉండేది. దానిపై 0.10 శాతం పెంచారు. ఇటీవలి కాలంలో బాండ్ దిగుబడి తగ్గినందున వడ్డీ రేటు తక్కువగా ఉండే అవకాశం ఉందని బోర్డులోని సభ్యుడు తెలిపినట్లు సమాచారం.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పెట్టుబడి ప్యానెల్ మిగులును కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నందున వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉందని బోర్డు సభ్యుడు మరొకరు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై TUCC జాతీయ ప్రధాన కార్యదర్శి షియో ప్రసాద్ తివారీ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై మంచి రాబడి వచ్చిందని, సబ్‌స్క్రైబర్ బేస్‌లో పెరుగుదల ఉందని అన్నారు. ఇవి తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన లక్షలాది మంది పొదుపు చేసిన డబ్బు. అధిక ద్రవ్యోల్బణం ఉన్న ఈ కాలంలో వడ్డీ రేటును తగ్గించడం వారి బాధలను మరింత తీవ్రతరం చేస్తుంది అని అన్నారు. గత సంవత్సరం గణనీయమైన వృద్ధి తర్వాత, గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్లు నిరంతర తిరోగమనాన్ని చూస్తున్నాయి. సెప్టెంబర్ 2024లో దాదాపు 86,000 పాయింట్లను తాకిన తర్వాత, సెన్సెక్స్ ఇప్పుడు 11,000 పాయింట్లకు పైగా పడిపోయి 75,000 వద్ద ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *