అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు సీ, ఇ, కే, బి6, ఖనిజాలు పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ముదురు ఆకుపచ్చ రంగులో, గరుకైన చర్మంతో, లోపల లేత ఆకుపచ్చ రంగులో మెత్తటి గుజ్జుతో ఉంటుంది.దీనిలో ఒక పెద్ద విత్తనం కూడా ఉంటుంది.దీనిని అలిగేటర్ పియర్ లేదా బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.
అవకాడో పోషకాలు అధికంగా ఉండే పండు. ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు 20 ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, డి, ఇ మరియు కె వంటి విటమిన్లు ఉంటాయి. ఈ పండు పిల్లల శారీరక అభివృద్ధికి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది పిల్లలకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
అవకాడోలో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీని వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాము. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంది.