ఈ ముసాయిదాను ఖరారు చేసిన తర్వాత సవరించిన నిబంధనలు తుది సర్క్యులర్‌లో పేర్కొన్న తేదీ లేదా ఆ తర్వాత ఫోర్‌క్లోజర్ చేసిన అర్హత కలిగిన రుణాలు లేదా అడ్వాన్స్‌లకు వర్తిస్తాయి. ఈ ముసాయిదా మార్గదర్శకాలు అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్‌కు వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ రేట్ లోన్లు అనేవి బెంచ్‌మార్క్ లేదా రిఫరెన్స్ రేటు ఆధారంగా వడ్డీ రేటు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ద్రవ్య విధాన సమీక్షల సమయంలో ఆర్‌బీఐ వడ్డీ రేటు నిర్ణయాల ప్రకారం ఫ్లోటింగ్ రేట్ లోన్లు మారుతూ ఉంటాయి. అంటే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేట్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. కానీ రేట్లు పెరిగితే అధిక చెల్లింపులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్!వీడియో
పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం
మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో