టాలీవుడ్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది కంటెంట్ విషయంలో కావొచ్చు.. ఆర్టిస్టుల విషయంలో కావొచ్చు. అందం, అభినయం ఉన్న అమ్మాయిలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తునే ఉంటారు. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అన్నీ కలిసిస్తే దశాబ్ధాల పాటు వారికి అవకాశాలు వెల్లువలా వస్తాయి. శ్రియ, త్రిష, నయనతార, కాజల్ వంటి హీరోయిన్స్ ఆ కోవకు చెందినవారే. ఇప్పుడు ఓ అమ్మాయి తెలుగు కుర్రాళ్లకు మోస్ట్ వాంటెడ్ క్వీన్‌గా మారింది. ఆ ఫోటోలను వాల్ పేపర్ కింద పెట్టుకుంటున్నారు చాలామంది. అలా ఈ పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా కొంతకాలం క్రితం టాలీవుడ్‌కు ఎంటరయ్యింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్‌గా నిలిచింది. సుశాంత్ హీరోగా చేసిన ఓ సినిమాలో హీరోయిన్గా చేసింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ బ్యూటీ స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఏంటి పోలికలను బట్టి ఏమైనా గుర్తుపట్టగలిగారా..? లేదా అయితే మేమే చెప్పేస్తాం.
తను మరెవరో కాదు మీనాక్షి చౌదరి. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది. ఆతర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది.
ఇవి కాక విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది. ఇవికాక పలు తమిళ సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం.