Smartphone Software Update: చాలా మంది కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్‌ను వాడుతుంటారు. కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత కంపెనీ అప్పుడప్పుడు కొత్త అప్డేట్లను విడుదల చేస్తుంటుంది. ఆ కంపెనీ పదే పదే సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేయడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా తలెత్తిందా? చాలా మంది మొబైల్ వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేస్తుంటే, కొంతమంది ఆ అప్డేట్ను విస్మరిస్తుంటారు.
ఫోన్లో కొత్త అప్డేట్ను ఇన్స్టాల్ చేయడం వల్ల ఫోన్‌కు ప్రయోజనకరంగా ఉందా లేదా హానికరంగా ఉందా ? అని తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా తదుపరిసారి అప్డేట్ను ఇన్స్టాల్ చేసే ముందు ఆ అప్డేట్ మీ ఫోన్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
బగ్ పరిష్కారాల కోసం అప్డేట్స్:
పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లోని లోపాలు, బగ్‌ల కారణంగా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లు విడుదల చేస్తుంటుంది కంపెనీ. ప్రజల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత బగ్‌లు, లోపాలను తొలగించే కొత్త అప్డేట్ను విడుదల చేస్తుంటుంది. ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్‌లోని సాంకేతిక సమస్యల కారణంగా చాలాసార్లు వినియోగదారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త అప్డేట్ తర్వాత వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్య పరిష్కారం అవుతుంది. తద్వారా ఆపరేటింగ్ సిస్టమ్‌తో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. బగ్‌లు, వివిధ సమస్యలతో పాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు కొత్త ఫీచర్లు జోడిస్తారని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
సాఫ్ట్వేర్ అప్డేట్లను డౌన్లోడ్ చేయడం వల్ల కలిగే ప్రతికూలత ఏమిటి?
సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసిన తర్వాత కొంతమంది వినియోగదారులు కొత్త అప్డేట్లో బగ్‌ల గురించి ఫిర్యాదు చేయడం లేదా కొంతమంది వినియోగదారులు ఫోన్లో కొత్త సమస్యను ఎదుర్కోవడం చాలాసార్లు గమనించే ఉంటారు. కొంతమంది కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ను చూసిన తర్వాత కూడా దానిని విస్మరించడానికి ఇదే కారణం. కానీ ఇది ప్రతిసారీ జరగకపోవచ్చని, కంపెనీ నుంచి వచ్చిన అప్డేట్స్ వెంటనే చేయడం మంచిదంటున్నారు టెక్ నిపుణులు.
ఇది కూడా చదవండి: Insurance: బీమాలో పాలసీదారు మరణానంతరం నామినీకి మాత్రమే ప్రయోజనం లభిస్తుందా? కోర్టు తీర్పు ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి