ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన కివీస్ ఫైనల్ టిక్కెట్ సొంతం చేసుకుంది. కివీస్ అందించిన 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదిచలేకపోయిన సౌతాఫ్రికా జట్టు.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులకు పరిమితమైంది. డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి సెంచరీతో అజేయంగా నిలిచాడు. కానీ, ఈ పోరాడం వృథాగా మిగిలిసెచింది.
కగిసో రబాడ (16 పరుగులు), ర్యాన్ రికెల్టన్ (17 పరుగులు)లను మాట్ హెన్రీ అవుట్ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (3 పరుగులు), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (69 పరుగులు), కెప్టెన్ టెంబా బావుమా (56 పరుగులు)లను మిచెల్ సాంట్నర్ పెవిలియన్‌కు వెనక్కి పంపాడు. కేశవ్ మహారాజ్ (1 పరుగు), మార్కో జాన్సెన్ (3 పరుగులు) గ్లెన్ ఫిలిప్స్, వేన్ ముల్డర్ (8 పరుగులు) మైఖేల్ బ్రేస్‌వెల్, ఐడెన్ మార్క్రమ్ (31 పరుగులు) రాచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.
అంతకుముందు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 6 వికెట్లకు 362 పరుగులు చేసింది. ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరుగా నమోదైంది. ఇదే మైదానంలో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 356 పరుగులు చేసింది.
కివీస్ తరపున రచిన్ రవీంద్ర (108 పరుగులు), కేన్ విలియమ్సన్ (102 పరుగులు) సెంచరీలు సాధించగా, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అర్ధ సెంచరీలు చేయలేకపోయారు. ఇద్దరూ తలో 49 పరుగులు చేశారు. లుంగి ఎన్గిడి 3 వికెట్లు పడగొట్టాడు. రబాడ 2 వికెట్లు పడగొట్టాడు. వేన్ ముల్డర్ ఒక వికెట్ తీసుకున్నాడు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వేన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి న్గిడి.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓ’రూర్కే.