Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది..12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మార్చి 6, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశి వారికి ధనపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొం టారు. బంధువులతో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ధనపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి లాభాలను పండిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహాల అనుకూలత వల్ల సాధారణంగా ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు ఎట్టకేలకు వసూలవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. బంధువుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు, కొత్త లక్ష్యాలను చేతికి అందుతాయి. వ్యాపారాల్లో కూడా కార్య కలాపాలు పెరిగి బాగా బిజీ అయిపోతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద బాగా శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందు తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయంలో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాలపరంగా కొద్దిగా పురోగతి సాధిస్తాయి. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు బాగా రాణిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ వల్ల ప్రయోజనం పొందుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తి వివాదం విషయంలో ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక విషయాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆశించిన శుభవార్త వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయక పోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువుల విష యంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొత్తం మీద ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు తేలికగా ఘనవిజయాలు సాధిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *