బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కన్నడ నటుల హవానే నడిచింది. కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే గౌతమ్ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యష్మీ కూడా ఒకరు. హౌస్ లో ఉన్నన్నీ రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు 12 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. అంతేకాదు ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్లో ఈవిడ కూడా ఒకరు. యష్మీ వారానికి సుమారు రెండున్నర లక్షల వరకు పారితోషికం అందుకుందని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్, సీరియల్స్ తో బిజి బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఇదిలా ఉంటే యష్మీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో యష్మీ పెళ్లి కూతురులా ముస్తాబైంది. ముఖానికి పసుపు రాసుకుని, మంగళ స్నానం చేస్తూ కనిపించి షాకిచ్చింది. దీంతో నెటిజన్లు అదేంటి? యష్మీ ఇంత సడెన్ గా పెళ్లి చూసుకుంటోంది? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
అయితే ఇది రియల్ పెళ్లి కాదని రీల్ పెళ్లి అని తెలుస్తోంది. ఏదో సీరియల్లోని సీన్ కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
యష్మీ గౌడ లేటెస్ట్ ఫొటోస్..
2017 లో విద్యా వినాయక అనే సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది యష్మీ.తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.ఆ ఆతర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది. నాగ భైరవి, స్వాతి చినుకులు, త్రినయని, కృష్ణ ముకుంద మురారి తదితర సీరియల్స్ యష్మీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .