నడక తర్వాత ఈ 4 లక్షణాలు కనిపిస్తే వెరీ డేంజర్.. డయాబెటిస్‌కు చేరువైనట్లే..

నడక తర్వాత ఈ 4 లక్షణాలు కనిపిస్తే వెరీ డేంజర్.. డయాబెటిస్‌కు చేరువైనట్లే..


ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా మధుమేహం కేసులు పెరుగుతున్నట్లు పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. అయితే.. డయాబెటిస్ సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించడం… లేదా నిర్వహించడం చాలా సులభమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. నడుస్తున్నప్పుడు కూడా మధుమేహం లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు.. వాస్తవానికి.. నడక అనేది ఒక సహజమైన చర్య.. ఎల్లప్పుడూ మనం నడుస్తూనే ఉంటాం.. అయితే.. నడుస్తున్నప్పుడు మీకు ఏదైనా భిన్నంగా లేదా అసౌకర్యంగా అనిపిస్తే, అది మధుమేహం ముందస్తు హెచ్చరిక సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి రక్తంలో చక్కెర స్థాయిలు, రక్త ప్రసరణ, నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నడుస్తున్నప్పుడు కనిపించే కొన్ని సంకేతాలను ముందుగానే గుర్తించడం వలన మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నడుస్తున్నప్పుడు లేదా నడక తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. అశ్రద్ధ చేయకండి..

  1. కాళ్ళ నొప్పులు: కొద్ది దూరం నడిచిన తర్వాత తరచుగా కాళ్ళ నొప్పులు రావడం డయాబెటిక్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) కి సంకేతం కావచ్చు. అధిక రక్తంలో చక్కెర ధమనులను గట్టిపరుస్తుంది.. ఇది ఇరుకుగా చేస్తుంది. పాదాలు, కాళ్ళకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీని వలన నడుస్తున్నప్పుడు కాళ్లు, తొడలు లేదా పిరుదులలో నొప్పి, తిమ్మిర్లు లేదా భారంగా అనిపిస్తుంది.
  2. పాదాలు – కాళ్ళలో జలదరింపు: మధుమేహం సాధారణ ప్రారంభ సంకేతం పాదాలు – కాళ్ళలో జలదరింపు.. దీనిలో అధిక రక్త చక్కెర చేతులు, కాళ్ళలోని నరాలను దెబ్బతీస్తుంది. ఇది కదిలేటప్పుడు జలదరింపు, మంట లేదా సూదులతో గుచ్చినట్లు అనుభూతిని కలిగిస్తుంది. మొదట్లో తేలికపాటిగా ఉన్నా.. కాలక్రమేణా అది పూర్తి స్థాయిలో తిమ్మిరిగా మారవచ్చు.
  3. పాదాలు – చీలమండలలో వాపు: డయాబెటిస్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పాదాలు, చీలమండలలో ద్రవం నిలుపుదల – వాపు వస్తుంది. నడిచిన తర్వాత మీ బూట్లు బిగుతుగా అనిపిస్తే లేదా మీ కాళ్ళు వాచిపోయినట్లు కనిపిస్తే, అది డయాబెటిస్ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు.
  4. అసాధారణ అలసట: మీరు కొద్దిసేపు నడిచిన తర్వాత కూడా అధికంగా అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపిస్తే, అది రక్తంలో చక్కెర అసమతుల్యత వల్ల కావచ్చు. హైపర్గ్లైసీమియా – హైపోగ్లైసీమియా రెండూ తీవ్ర అలసటకు కారణమవుతాయి.. ఎందుకంటే అధిక రక్తంలో చక్కెర స్థాయిలు శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నాయని సూచిస్తున్నాయి.

కాగా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి.. వారు చెప్పిన విధంగా సలహాలు, సూచనలు పాటించండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *