AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?

AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?


ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి జనసేన నేత నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్‌తోపాటు.. పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక.. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాలు ఉండగా.. ఒక అభ్యర్థిగా నాగబాబు పేరును కూటమి ఖరారు చేయడంతో పవన్ ఆదేశాల మేరకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

వాస్తవానికి.. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అంతకుముందు.. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటారనే టాక్‌ కూడా గట్టిగానే నడిచింది. అయితే.. ఆయా ప్రచారాలు ఎలా ఉన్నా.. సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్‌ డిక్లేర్‌ చేయడంతో నామినేషన్‌ వేశారు. ఇదిలావుంటే.. ఐదు స్థానాలు కూటమికే దక్కనుండడంతో ఆయా సీట్ల కోసం చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్యులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. దాంతో.. అప్పట్లో హామీ పొందిన నేతలు.. ఇప్పుడు సీఎం చంద్రబాబును.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవరికి చాన్స్‌ దక్కుతుంది?.. అనేది ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.    



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *