Bihar: పోలీసులనే తరిమితరిమి కొట్టిన గుడుంబా బ్యాచ్‌! ఖాకీ సినిమా సీన్స్‌ రిపీట్‌

Bihar: పోలీసులనే తరిమితరిమి కొట్టిన గుడుంబా బ్యాచ్‌! ఖాకీ సినిమా సీన్స్‌ రిపీట్‌


ఏదైనా తప్పు చేస్తే పోలీసులు పట్టుకెళ్తారని భయ పడతాం. ఇంటికి ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ వస్తే కూడా కంగారు పడిపోతాం. అలాంటిది ఓ ఊరికి పదుల సంఖ్యలో పోలీసులు రెండు జీపులు వేసుకొని వచ్చినా.. ఓ ఊరిలో కొందరు అస్సలు భయపడలేదు సరికదా.. పోలీసులనే తరిమి తరిమి కొట్టారు. తమిళ హీరో కార్తీ హీరోగా వచ్చిన ఖాకీ సినిమాలో పోలీసులను ఓ ఊరి ప్రజలంతా ఏకమై దాడి చేసినట్లు.. ఇక్కడ కూడా ఏకంగా 11 మంది పోలీసులను గాయపర్చారు గుడుంబా బ్యాచ్‌. షాక్‌కు గురిచేసే ఈ సంఘటన బిహార్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బీహార్‌లోని పాలిగంజ్‌లో అక్రమ మద్యం వ్యాపారుల దాడిలో 11 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హోలీ పండగకి ముందు రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీని ఆపడానికి ఈ పోలీసులు ఓ ఊరిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులపై అక్రమ మద్యం వ్యాపారులు తిరగబడి, రెండు పోలీసు వాహనాలను తగలబెట్టి, పోలీసులను గాయపర్చారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన తర్వాత, సమీపంలోని అనేక పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులు, డీఎస్‌పీ స్థాయి అధికారి హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకొని పోలీసులపై దాడి చేసిన గుడుంబా బ్యాచ్‌ తాటతీశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు రావడంతో అప్పటి వరకు ఎదురుతిరిగిన మద్యం మాఫియాలో కొంతమంది అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

ఈ సంఘటన గురించి రానిటల్ SHO ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, “హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవడానికి, అక్రమ మద్యం తయారీని ఆపడానికి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాఘోపూర్‌లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పుడు, అక్రమ మద్యం వ్యాపారులు పోలీసు బృందంపై దాడి చేశారు. రెండు వాహనాలను తగలబెట్టారు. 11 మంది పోలీసులను గాయపర్చారు. దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశాం” అని తెలిపారు. డీఎస్పీ ప్రీతమ్ సింగ్ మాట్లాడుతూ, “హోలీ పండుగ కోసం రాఘోపూర్ ముషారీలో అక్రమ మద్యం వ్యాపారంతో పాటు సారాయి తయారు చేస్తున్నట్లు రాణితాల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది, ఆ తర్వాత పోలీసు బృందం రాఘోపూర్ ముషారీకి చేరుకుని తనిఖీలు చేస్తుండగా అకస్మాత్తుగా, మద్యం మాఫియా రాళ్ల దాడి చేసింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, సమీప పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు ముషారీలో దాడులు నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకోవడం వారిని అదుపుచేయగలిగాం” అని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *