మార్చి 13, 14 తేదీల్లో అందరికీ ఇష్టమైన హోలీ పండగ రానుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. అయితే ఈ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే తక్షణమే టిక్కెట్లను బుక్ చేసుకునే వీలుంటుంది. హోలీ పండగకు ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. సొంతూళ్లకు రావడానికి ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పని ఒత్తిడిలో పడి టిక్కెట్లు రిజిర్వేషన్ చేసుకోనివారు మాత్రం హైరానా పడుతుంటారు. ఇలాంటి వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఈ కింది తెలిపిన చిట్కాలను పాటిస్తే ధ్రువీకరించిన టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకోవచ్చు. సమయం ఆలస్యం కాకుండా త్వరితగతిన తీసుకునే అవకాశం కలుగుతుంది.
ఐఆర్ సీటీసీ యాప్
రైలులో ప్రయాణించాలనుకునే వారందరూ ముందుగా ఐఆర్ సీటీసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలోకి లాగిన్ అవ్వండి. మీరు ఎక్కాల్సిన రైలు పేరు, నంబర్ ను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో వేర్వేరు రైలు నంబర్లు, మార్గాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ముందుగానే వాటిని సేవ్ చేసుకోండి.
మాస్టర్ లిస్ట్
ధ్రువీకరించిన టిక్కెట్లను పొందడం కోసం ముందుగానే ప్రయాణికుల మాస్టర్ లిస్ట్‌ను సిద్ధం చేయాలి. దీనిలో ప్రయాణించేవారి పేర్లు, బెర్త్ ప్రాధాన్యతలు, ఆహార ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారమంతా ముందుగానే సేవ్ చేసుకోవడం వల్ల టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ సమయం ఆదా అవుతుంది. ఐఆర్సీటీసీ ఖాతాలోని మై ప్రొఫైల్ అనే విభాగానికి వెళ్లడం ద్వారా మాస్టర్ జాబితాను తయారు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఇ-వాలెట్
టిక్కెట్ల సొమ్మును త్వరితగతిన చెల్లించడానికి యూపీఐ వాలెట్ ఉపయోగించడం మంచిది. దీని ద్వారా త్వరితగతిన చెల్లించే అవకాశం కలుగుతుంది. , ఇంటర్నెట్ బ్యాంకింగ్ కన్నా ఇదే మంచి విధానం. ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లాగిన్, పాస్ వర్డ్, ఓటీపీ నమోదు చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఐఆర్సీటీసీ ఇ-వాలెట్ కు డబ్బును పంపవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి