Whatsapp Feature: వాట్సాప్‌లో ఆకట్టుకుంటున్న అదిరే ఫీచర్.. ఏఐ సాయంతో గ్రూప్ ఐకాన్

Whatsapp Feature: వాట్సాప్‌లో ఆకట్టుకుంటున్న అదిరే ఫీచర్.. ఏఐ సాయంతో గ్రూప్ ఐకాన్


గ్రూప్ చాట్‌ల కోసం వాట్సాప్ కొత్త ఏఐ ఆధారిత ప్రొఫైల్ పిక్చర్ జనరేటర్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం పరిమిత బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంచి పరీక్షిస్తున్నారు. మెటా ఏఐను ఉపయోగించి పర్సనలైజ్డ్ ప్రత్యేకమైన గ్రూప్ ఐకాన్స్ సృష్టించవచ్చు.  అయితే ఈ ఫీచర్ గురించి మిగిలిన వివరాలతో పాటు అందరి వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్ ఏఐ ప్రొఫైల్ పిక్చర్ జనరేటర్ యూజర్లు తమకు కావాల్సిన ఇమేజ్‌ను టెక్స్ట్ ప్రాంప్ట్‌ని ఉపయోగించి వివరించడం ద్వారా కస్టమ్ గ్రూప్ ప్రొఫైల్ చిత్రాలను సృష్టించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ పర్సనల్ ప్రొఫైల్ చిత్రాల కోసం ఉపయోగంలో ఉండదు. అలాగే వినియోగదారులు వారి గ్రూప్‌నకు సంబంధించిన థీమ్, ఆసక్తులు లేదా వైబ్ ఆధారంగా వివరణలను నమోదు చేయవచ్చు. అప్పుడు ఏఐ ఇచ్చిన ప్రాంప్ట్‌కు సరిపోయే చిత్రాన్ని రూపొందిస్తుంది. అలాగే ఏఐ ఫీచర్ ఫ్యూచరిస్టిక్ టెక్, ఫాంటసీ లేదా ప్రకృతి ప్రేరేపిత డిజైన్‌ల వంటి ముందే సెట్ చేయబడిన థీమ్‌లను అందించవచ్చు. దీని వల్ల వినియోగదారులు అద్భుతమైన విజువల్స్‌ను సృష్టించడం సులభం అవుతుంది.

వాట్సాప్ ఏఐ ప్రొఫైల్ పిక్చర్ జనరేటర్ ఫీచర్ ప్రస్తుతం బీటా పరీక్షకులకు అందుబాటులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్‌లోని కొంతమంది వాట్సాప్ బీటా టెస్టర్స్ ఇప్పటికే ఏఐ- జనరేటెడ్ గ్రూప్ ఐకాన్‌లకు యాక్సెస్‌ను పొందారు.బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో భాగం కాని వినియోగదారులకు కూడా ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్‌కు సంబంధించిన స్థిరమైన వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. అలాగే ఐ ఫోన్ వినియోగదారులకు మాత్రం ఈ అప్‌డేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో? అనే విషయంపై అధికారిక సమాచారం లేదు. కానీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *