India vs New Zealand, Final: ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గత 9 నెలల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది రెండో ఐసీసీ టైటిల్. గత జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.
అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇద్దరినీ సాంట్నర్ అవుట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు, శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేశారు. వీరిద్దరి మధ్య 105 పరుగుల భాగస్వామ్యం కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
జట్లు:
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🇮🇳🏆 🏆 🏆
The Rohit Sharma-led #TeamIndia are ICC #ChampionsTrophy 2025 𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 👏 👏
Take A Bow! 🙌 🙌#INDvNZ | #Final | @ImRo45 pic.twitter.com/ey2llSOYdG
— BCCI (@BCCI) March 9, 2025
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్.
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..