దిన ఫలాలు (మార్చి 10, 2025): మేష రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం పరవాలేదనిపిస్తుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు విన డం జరుగుతుంది. ఆదాయం బాగానే పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు సన్నిహితుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు పడతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఆశించిన లాభాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు విజయాలు సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగా యాక్టివిటీ పెరిగి, బిజీ అవుతారు. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక సహాయం విషయంలో బంధుమిత్రుల ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బును రాబట్టుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల వివాదాల్లో తల దూర్చకపోవడం మంచిది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ముఖ్య మైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కార మయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త లక్ష్యాలను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అనారోగ్యాల నుంచి కొద్దిగా కోలుకునే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత బంధువులతో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయక పోవడం ఉత్తమం. కొందరు బంధుమిత్రులతో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా, సజావుగా సాగిపోతాయి. అనుకున్న సమయానికి కొన్ని ముఖ్య మైన పనులు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు పొందుతారు. తలపెట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.