భారత క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడం విజయోత్సాహాన్ని అందరికీ అందించింది. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన ఆనందం మధ్య న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోసం బాధను వ్యక్తం చేశారు. “ఓడిపోయిన జట్టులో నాకు చాలా మంచి స్నేహితుడు ఉండటం బాధగా ఉంది” అని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ ప్రదర్శనను కూడా ప్రశంసించాడు. “వారికి పరిమిత సంఖ్యలో ఆటగాళ్లు ఉన్నా, వారి ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. న్యూజిలాండ్ ఎప్పుడూ పోటీని చివరి వరకు కొనసాగించగలగడం వారి ప్రత్యేకత” అని పేర్కొన్నాడు. “వారిది అత్యుత్తమ ఫీల్డింగ్ యూనిట్. కేన్ విలియమ్సన్ నా అత్యంత సన్నిహిత స్నేహితుడు. అలాంటి గొప్ప ఆటగాడు ఓడిన జట్టులో ఉండటం నన్ను బాధించింది. కానీ న్యూజిలాండ్ టాప్ క్లాస్ జట్టు, వారు ఎప్పుడూ తమ ఆటను మరింత మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తారు” అని కోహ్లీ చెప్పాడు. “న్యూజిలాండ్ ఎల్లప్పుడూ కఠిన పోటీతత్వ జట్టు. వారు ఫండమెంటల్స్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అదే వారిని ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేకంగా నిలబెట్టింది” అని కోహ్లీ చెప్పాడు.
ఐసీసీ ట్రోఫీలు గెలవడం మాత్రమే తన పని కాదని, భారత క్రికెట్‌ను మరింత బలోపేతం చేయడమే తన నిజమైన బాధ్యత అని కోహ్లీ పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కి మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తాను తన కేరీర్ కొనసాగిస్తున్నానని చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు, ఐసీసీ టోర్నమెంట్‌లో మరో అద్భుతమైన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, “జట్టును మెరుగైన స్థితిలో వదిలివేయడం, రాబోయే ఎనిమిదేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఎదుర్కొనేలా భారత జట్టును సిద్ధం చేయడం నా బాధ్యత” అని చెప్పాడు.
భారత జట్టు ఆరు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడంతో కోహ్లీ ఆనందంగా కనిపించినా, తన వ్యక్తిగత ప్రదర్శన గురించి మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఫైనల్లో కోహ్లీ ఒక్క పరుగుకే ఔటయ్యాడు, కానీ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ, గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై శతకం భారత జట్టు విజయానికి ఎంతో సహాయపడింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కోహ్లీ ప్రసారకర్త జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ, “కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మేము తిరిగి పుంజుకోవాలనుకున్నాము. ఒక పెద్ద టోర్నమెంట్ గెలవాలనే సంకల్పంతో ఈ టోర్నీకి వచ్చాం. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం చాలా ప్రత్యేకమైన విషయం” అని చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..