మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా.. ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం.
#WATCH | Port Louis: Mauritius PM Navinchandra Ramgoolam announces its highest award ‘The Grand Commander of the Order of the Star and Key of the Indian Ocean’ for PM Modi. pic.twitter.com/5NBvULu75Q
— ANI (@ANI) March 11, 2025
మరోవైపు ప్రధాని మోదీ మారిషస్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. మారిషస్ స్వాతంత్ర్యదిన వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మారిషన్ రాజధాని పోర్టు లూయిస్ చేరుకున్నారు. అక్కడి భారతీయ సమాజం ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికింది. ప్రధాని గౌరవార్థం బిహార్ సంప్రదాయ పద్ధతి గీత్ గవాయ్ ఏర్పాటు చేశారు. అక్కడి మహిళలు సాంప్రదాయ బీహారీ భోజ్‌పురి సంగీతం ‘గీత్ గవాయ్’తో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు మారిషస్ సంస్కృతిలో భోజ్‌పురి భాష భాగం కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
సాంస్కృతిక మార్పడిలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు ధరమ్బీర్ గోకుల్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు అందించారు. ఇత్తడి,రాగితో చేసిన ప్రత్యేక కలశంలో తీసుకెళ్లిన మహాకుంభమేళా సంగమ జలాలను బహుకరించారు. బిహార్ నుంచి తీసుకొచ్చిన మకానాతో పాటు డ్రై ఫ్రూట్స్‌ను అందించారు. మారిషన్ అధ్యక్షుడి భార్య బృందా గోకుల్‌కు గుజరాత్‌లో నేసిన బెనారస్ పట్టు చీరను అందజేశారు. అది అందిస్తూ ఇది తన స్వరాష్ట్రంలో తయారైన చీర అని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. బిహార్‌లో ప్రత్యేకంగా సాగు చేసే మఖానాను కూడా ప్రధాని బహుమతిగా అందించారు. ఎన్నో శతాబ్ధాల నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య , సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు మోదీ. అంతకముందు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గోలంతో కలిసి సర్‌సీవూసాగర్ రామ్‌గులం బొటానికల్ గార్డెన్‌లో ఒక మొక్కను నాటారు ప్రధాని మోదీ.