Viral: సరైనోడు.. స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురీడి కొట్టించి.. వాడి దగ్గర డబ్బులు నొక్కేశాడు

Viral: సరైనోడు.. స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురీడి కొట్టించి.. వాడి దగ్గర డబ్బులు నొక్కేశాడు


Viral: సరైనోడు.. స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురీడి కొట్టించి.. వాడి దగ్గర డబ్బులు నొక్కేశాడు

స్కామర్స్ ఈ మధ్య చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ డిజిటల్ అరెస్ట్. మీ పేరుతో డ్రగ్స్ డెలివరీ అయ్యాయి.. మీ అమ్మాయి/అబ్బాయి అక్రమ బంగారం తరలిస్తూ పట్టుబడ్డారు.. అంటూ పోలీస్, సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ ఏజెన్సీల పేరుతో కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. వదిలెయ్యాలంటే.. డబ్బులు ముట్టుజెప్పాలంటే.. దోచేయడం మొదలెట్టారు. ఈ తరహా క్రైమ్స్‌పై ప్రజలను పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాల్ చేసిన ఓ స్కామర్‌లో బురిడీ కొట్టించాడు ఓ వ్కక్తి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌కు చెందిన భూపేంద్రసింగ్‌‌కు సీబీఐ ఆఫీసర్ పేరిట ఓ సైబర్ కేటుగాడు ఒకరు కాల్ చేశారు. అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని,  కేసు మూసివేయడానికి రూ.16వేలు ఇవ్వాలంటూ వాడు బెదిరించే యత్నం చేశాడు. అయితే ఈ తరహా కాల్స్‌పై అవగాహన ఉన్న సింగ్.. రివర్స్ గేమ్ ప్లే చేశాడు. ఆ స్కామర్ నుంచి డబ్బులు పిండాలని డిసైడయ్యాడు. ‘‘ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పవద్దు.. అదే జరిగితే నా జీవితం ఖతం’’ అంటూ యాక్షన్‌లోకి దిగాడు. డబ్బు ఇస్తే చెప్పను అని స్కామర్ చెప్పగా.. భూపేంద్ర తమ మార్క్ స్టోరీలతో అవతలి స్కామర్‌ను బురిడీ కొట్టించాడు. తాను గతంలో తాకట్టు పెట్టిన గోల్డ్ చైన్ విడిపించడానికి రూ.3000 వేలు కావాలని తిరిగి ఆ స్కామర్‌నే అడిగాడు. ఆ చైన్‌ను మళ్లీ తాకట్టు పెట్టి.. అడిగినంత డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు.  ఆ మాటలు నమ్మిన సైబర్ కేటుగాడు తొలుత రూ.3వేలు పంపాడు. ఈ యవ్వారం ఇంతటితో ఆగలేదు.

తాను మైనర్ అవ్వడం వల్ల గోల్డ్ షాపు వ్యక్తి.. చైన్ తాకట్టు నుంచి ఇవ్వడం లేదని సింగ్.. స్కామర్‌తో చెప్పాడు. మీరే నా తండ్రిలా గోల్డ్ షాపు ఓనర్‌తో మాట్లాడాలంటూ కేటుగాడిని కోరాడు. ఈ గ్యాప్‌లో తన ఫ్రెండ్‌ను  నగల వ్యాపారిలా మాట్లాడాలని కోరాడు సింగ్. దీంతో స్కామర్ మరోసారి బోల్తా కొట్టాడు. బంగారు షాపు యజమాని అనుకుని… సింగ్ మిత్రుడితో మాట్లాడిన స్కామర్.. మరోసారి రూ.4,480 పంపాడు. అనంతరం ప్రాసెస్ ఫీజ్ కింద రూ.3 వేలు ఇస్తే.. ఆ గొలుసుపై రూ.1.10 లక్షలు లోన్ ఇస్తానని.. సింగ్ స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మిన స్కామర్ ఆ డబ్బు కూడా పంపాడు. ఇలా మొత్తంగా రూ.10వేల వరకు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

ఆఖరకు తానే చిత్తయిపోయానని గ్రహించిన సైబర్ కేటుగాడు.. తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఫోన్ చేసి బ్రతిమాలుకోవడం గమనార్హం. ఆ తర్వాత సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జరిగిందంతా వెల్లడించారు. తాను తీసుకున్న రూ.10వేలను డోనేషన్‌గా ఇస్తానని చెప్పారు. ఈ విషయం నెట్టింట వైరల్ అవుతంది. భూపేంద్రసింగ్‌‌‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *