RR vs CSK IPL Match Result: ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ సీజన్లో రాజస్థాన్ తొలి విజయం సాధించగా, చెన్నైకి ఇది రెండో ఓటమి.
గౌహతిలో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వనిందు హసరంగా 4 వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులు చేశాడు. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీష్ పతిరానా తలా 2 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి
ఇరుజట్ల ప్లేయింగ్-11..
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్ మరియు మతిష్ పతిరానా. ప్రభావం: శివం దుబే, ముఖేష్ చౌదరి, డెవాన్ కాన్వే, షేక్ రషీద్, సామ్ కుర్రాన్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహిష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ. ప్రభావం: కునాల్ సింగ్ రాథోడ్, శుభం దుబే, ఫజల్హాక్ ఫరూఖీ, కుమార్ కార్తికేయ, యుధ్వీర్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..