అతనికి విపరీతమైన 3 నెలల నుంచి విపరీతమైన కడుపునొప్పి ఉంది. పొత్తి కడుపులో ఏదో గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. దీంతో తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి పరీక్షలు చేసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. అతని కడుపులో సూది లాంటి పొడవైన వస్తువు ఉన్నట్లు గుర్తించి.. సర్జరీ చేసి బయటకు తీశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి ( వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి)లో జరిగింది. సర్జరీ అనంతరం అతని కడుపు నుంచి బయటకు తీసింది దబ్బనం (పొడవైన సూది) గా గుర్తించారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నల్లకుంటలో నివాసం ఉంటున్న దేవరకొండకు చెందిన మురళి ట్రాన్స్‌పోర్ట్ వాహనాన్ని నడుపుతుంటాడు. 3 నెలలుగా కడుపు నొప్పితో అతడు బాధపడుతున్నారు. ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తోందని వారం కిందట కింగ్ కోఠి ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు స్కానింగ్, ఇతర టెస్ట్లు చేసి, పొడవైన సూది లాంటి వస్తువు ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో శుక్రవారం డాక్టర్ వెంకటేష్, డాక్టర్ బాల్‌రాజ్, అనస్థీషియాలజిస్ట్ శ్రీమంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం సర్జరీ చేసింది. ఈ క్రమంలోనే బాధితుడి కడుపులో 5 అంగుళాల పొడవైన దబ్బనం ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దబ్బనంను జాగ్రత్తగా బయటకు తీసి అతడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అయితే వారు విచారించినప్పటికీ, మురళి సూది తన కడుపులోకి ఎలా వెళ్లిందో వెల్లడించలేదు.

Long Needle
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..