ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి. బడ్జెట్, మేకింగ్, మార్కెట్, సక్సెస్ ఇలా ప్రతీ విషయంలో రాజమౌళి స్టాంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథకు విజువల్ ఎఫెక్ట్స్‌ను వాడుకోవటంలో జక్కన్నది సపరేట్ స్టైల్. ఈగను మెయిన్ క్యారెక్టర్‌గా చూపించినా… తారక్, పులి మధ్య యాక్షన్ సీన్ ప్లాన్ చేసినా… అది జక్కన్నకే చెల్లింది.
తన నెక్ట్స్ సినిమాతో మరో విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. మహేష్‌తో గ్లోబల్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్న జక్కన్న, ఈ సారి ఏకంగా డైనోసార్‌తో ఫైట్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట.
ఫాంటసీ యాక్షన్ డ్రామా కాబట్టి కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకొని నెక్ట్స్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్‌ను వాడుతున్నారు. అందుకోసం ఇండియన్ కంపెనీస్‌తో పాటు ఫారిన్ వీఎఫ్ఎక్స్ టీమ్స్‌తోనూ కొలాబరేట్ అవుతున్నారు.
మన సినిమా స్థాయిని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తున్న మరో విజువల్ వండర్ ఏఏ 22. పుష్పతో నేషనల్ మార్కెట్‌ను షేక్ చేసిన బన్నీ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. అందుకే అదే రేంజ్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. విజువల్‌గా ఇండియన్ స్క్రీన్ ఇంత వరకు ఎక్స్పీరియన్స్ చేయని కొత్త వరల్డ్‌ను చూపించబోతున్నారు.
ఎనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసింది అట్లీ టీమ్. ఈ సినిమా ప్యారలల్ వరల్డ్స్‌లో జరిగే ఫాంటసీ కథ అన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే వీఎఫ్ఎక్స్కు మ్యాగ్జిమమ్ స్కోప్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్ నుంచే ప్లానింగ్ చేస్తోంది టీమ్. ఇలా మన మేకింగ్ స్టైల్‌తో హాలీవుడ్‌ను కూడా సవాల్ చేస్తోంది తెలుగు సినిమా.