Gold Price Today: ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30న అంటే నేడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని అంతా భావిస్తుంటారు. బంగారు ఆభరణాల నుంచి బంగారు నాణేల వరకు ఏది వీలైతే అది ఇంటికి తెచ్చుకుంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఈరోజు అంటే ఏప్రిల్ 30న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
కొన్ని రోజుల క్రితం, 24 క్యారెట్ల బంగారం ధర (ఈరోజు బంగారం ధర) రూ. లక్షకు చేరుకుంది. నేడు దాని ధర రూ. 97,980 కి చేరింది. అంటే అక్షయ తృతీయ రోజు బంగారం ధర 10 గ్రాములకు రూ. 3000 కంటే ఎక్కువ తగ్గింది. అదే సమయంలో, వెండి ధరలు కూడా తగ్గాయి.
ఈరోజు బంగారం కాస్త ఖరీదైనదే..
అక్షయ తృతీయ రోజు బంగారం ధరలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ మార్కెట్ (MCX)లో జూన్ 5 ఫ్యూచర్స్ బంగారం ధర ఈరోజు రూ. 615లు తగ్గింది. ఈరోజు MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.95,410గా నమోదైంది. ఈరోజు గరిష్ట ధర రూ.95800 కాగా, కనిష్ట ధర రూ.95031గా నమోదైంది.
బులియన్ మార్కెట్లో బంగారం ధర..
ఇండియన్ బులియన్ మార్కెట్ (IBJA) ప్రకారం, బంగారం ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 96,100 రూపాయలుగా ఉంది. కాగా, మంగళవారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 97,970 రూపాయలుగా ఉంది. అదేవిధంగా, బుధవారం నాడు 22 క్యారెట్ల బంగారం రేటు ఉదయం 10 గ్రాములకు రూ.89,810లుగా ఉంది. కాగా, మంగళవారం నాడు 22 క్యారెట్ల బంగారం రేటు ఉదయం 10 గ్రాములకు రూ.89,800లుగా ఉంది.
18 క్యారెట్ల బంగారం ధర..
ఈరోజు బుధవారం, ఉదయం ట్రేడింగ్ సమయంలో, భారత బులియన్ మార్కెట్లో 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,490గా ఉంది. కాగా, మంగళవారం నాడు 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,400గా ఉంది.
తగ్గిన వెండి ధర..
అదే సమయంలో బుధవారం ఉదయం వెండి కిలోకు రూ.1,00,400లుగా నమోదైంది. కాగా, మంగళవారం నాడు 10 గ్రాములకు రూ.1,00,500లుగా ఉంది. అంటే, నేడు కిలోకు రూ. 100లు తగ్గింది.
దేశంలోని వివిద నగరాల్లో నమోదైన బంగారం ధరలు (10 గ్రాములకు)..
సిటీ | 22K | 24K | 18K |
---|---|---|---|
చెన్నై | రూ.89810 | రూ.97980 | రూ. 74360 |
ముంబై | రూ. 89810 | రూ. 97980 | రూ. 73490 |
ఢిల్లీ | రూ. 89960 | రూ. 98130 | రూ. 73610 |
కోల్కతా | రూ. 89810 | రూ. 97980 | రూ. 73490 |
బెంగళూరు | రూ. 89810 | రూ. 97980 | రూ. 73490 |
హైదరాబాద్ | రూ. 89810 | రూ. 97980 | రూ. 73490 |
కేరళ | రూ. 89810 | రూ. 97980 | రూ. 73490 |
వైజాగ్ | రూ. 89810 | రూ. 97980 | రూ. 73490 |
విజయవాడ | రూ. 89810 | రూ. 97980 | రూ. 73490 |
అహ్మాదాబాద్ | రూ. 89860 | రూ. 98030 | రూ. 73530 |
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..