Actor Bharath: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ జీవితంలో కన్నీళ్లు పెట్టించే కష్టాలు.. ఆ ఒక్క యాక్సిడెంట్ కాకుండా ఉంటే..

Actor Bharath: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ జీవితంలో కన్నీళ్లు పెట్టించే కష్టాలు.. ఆ ఒక్క యాక్సిడెంట్ కాకుండా ఉంటే..


ఒకప్పుడు సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ కొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తెలుగు అడియన్స్ మదిలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న బాలనటీనటులలో భరత్ ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్, సహజ నటనతో కట్టిపడేశాడు. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆనందమానందమాయే, గుడుంబా శంకర్, పోకిరి, అందాల రాముడు, దుబాయ్ శీను ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు భరత్. తెలుగులో దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. అయితే చిన్నప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న భరత్.. ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత పెద్దయ్యాక పలు చిత్రాల్లో కనిపించాడు. కానీ ఎప్పుడో ఒక సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. ఇంతకీ భరత్ ఏం చేస్తున్నాడు.. ? అంటూ ఇప్పుడు నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భరత్ తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి బయటపెట్టాడు. చిన్నప్పుడు బొద్దుగా కనిపించిన భరత్.. పెద్దయ్యాక మాత్రం సిక్స్ ప్యాక్ బాడీతో హీరో కటౌట్ తో కనిపించి ప్రేక్షకులకు షాకిచ్చాడు. అటు సినిమాలు చేస్తూనే తాను మెడిసన్ కోర్సు పూర్తిచేసినట్లు తెలిపాడు. చెన్నైలోని ఒక కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో తనకు ఆక్సిడెంట్ అయ్యిందని.. అప్పటివరకు బొద్దుగా ఉండే తాను ఆకస్మాత్తుగా సన్నగా అయ్యానని అన్నారు. ఆ తర్వాత జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో తనకు ఒక ఐరన్ రాడ్ కంటిలో గుచ్చుకోవడంతో కంటిలోని బ్లాక్ ఏర్పడిందని.. ఇప్పటికీ తనకు సరిగ్గా కనిపించదని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం చదువులపై ఫోకస్ పెట్టిన భరత్.. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ గా ఉంటున్నాడు భరత్. ఎప్పుడో ఒక పోస్ట్ చేస్తున్నాడు. కానీ అప్పట్లో బొద్దుగా ఉన్న భరత్.. ఇప్పుడు మాత్రం సిక్స్ ప్యాక్ బాడీతో హీరో కటౌట్ తో కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *