అటు TTP, ఇటు బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి..!

అటు TTP, ఇటు బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి..!


ముందు భారత్‌.. వెనుక బలూచ్‌.. పాకిస్తాన్‌కు రెండువైపులా వాయింపుడు షురూ అయింది. బలూచ్‌ ముందు పాక్‌ తూచ్ అవుతోంది. BLA ఫైటర్స్‌.. మొన్న పాక్‌ ఆర్మీ జవాన్ల దుస్తులు విప్పేశారు. ఇప్పుడు మరింత ఉధృతంగా దాడులు చేస్తున్నారు. పాక్‌ ఆర్మీని తరిమికొడుతున్నారు. బలూచిస్తాన్‌లో విజయకేతనం ఎగురవేస్తున్నారు.

పాకిస్థాన్‌కు బలూచ్‌ ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తోంది. పాకిస్తాన్‌ చేతుల్లో నుంచి బలూచిస్తాన్‌ జారిపోతోంది. BLA వరుస దాడులతో పాక్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. గత 24 గంటలుగా బలూచిస్తాన్‌లో నాన్‌స్టాప్‌ వార్‌ జరుగుతోంది. పాక్‌ సైన్యాన్ని.. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ తరుముతోంది. బలూచిస్తాన్‌లో 39 చోట్ల పాక్‌ ఆర్మీపై BLA దాడులు చేసింది. పాక్‌ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుని, హైవేలను నిర్బంధించింది. పాకిస్తాన్‌ పోలీసులను ఖైదు చేసింది. పాక్‌ ఆర్మీ ఇన్‌ఫార్మర్లను కూడా BLA ఫైటర్లు అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. పాక్‌ బలగాలపై ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. బాంబులతో పాక్‌ ఆర్మీ వాహనాలను పేల్చివేస్తున్నారు.

బలూచిస్తాన్‌లో తిరుగుబాట్లతో పాక్‌ తోక ముడుస్తోంది. బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఫైటర్స్ సాయుధ పోరాటం చేస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్తాన్‌ ఆర్మీని బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ‌ సాయుధులు తరుముతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. బలూచిస్తాన్‌ లోని మాచ్‌కుండ్‌ ప్రాంతంలో పాక్‌ ఆర్మీ వాహనంపై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో 14 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు.

బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టాలో ఉన్న పాకిస్తాన్‌ ఫ్రాంటియర్‌ కార్ప్స్‌ ప్రధాన కార్యాలయంపై BLA మెరుపుదాడులు చేసింది. క్వెట్టాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. క్వెట్టా కాంబ్రానీలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌పై దాడి చేసింది బలూచిస్తాన్ ఆర్మీ . ఆ తరువాత దగ్గరలో ఉన్న 6 ప్రాంతాల్లో ఒకేసారి పేలుళ్లు జరిపారు. పాక్‌లో చమురు క్షేత్రాలపై బలూచీలు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాక్ సైనికులు సహా చాలా మంది సాధారణ ప్రజలు కూడా చనిపోయారని తెలుస్తోంది. ఈ దాడులతో పాకిస్తాన్ సైన్యం క్వెట్టా నుంచి పారిపోయినట్లు సమాచారం అందుతోంది. కాలత్‌ జిల్లా మంగోచర్‌ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్‌ ఆర్మీకి వ్యతిరేకంగా తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని BLA ఫైటర్లు చెబుతున్నారు.

బలూచిస్తాన్‌లోని సంట్సర్‌, టుర్బట్‌, పస్ని, పంజ్‌గుర్‌, బేలా, కలట్‌, మట్సుంగ్‌, బోలన్‌, క్వెట్టా, పిషిన్‌, సిబి, ముసాఖైల్‌.. ఇలా ముఖ్యమైన 12 ప్రాంతాల్లో బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ భీకరమైన దాడులు చేస్తోంది. ఈ దాడులతో పాకిస్తాన్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. ఇక పాకిస్తాన్‌కు మరో కొత్త హెడేక్‌ మొదలైంది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా విజృంభిస్తోంది. దక్షిణ వజీరిస్తాన్‌లోని డాంగేట్ చెక్‌పాయింట్‌పై TTP దాడి చేసి 22 మంది పాకిస్తానీ సైనికులను చంపింది. అటు TTP, ఇటు బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ సైన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రత్యేక దేశం కోసం బలూచీ తిరుగుబాటుదారులు కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్‌తో పోరాడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *