Tollywood: మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో..

Tollywood: మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో..


తెలుగు సినీరంగంలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. యాక్టింగ్, కామెడీ టైమింగ్‏తో ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకప్పుడు మహేష్ బాబు సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆ కుర్రాడు.. ఇప్పుడు వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. యంగ్ హీరో సంగీత్ శోభన్. మ్యాడ్ సినిమాలో ముగ్గురు హీరోలలో డిడి పాత్రలో నటించి మెప్పించాడు సంగీత్ శోభన్. సూపర్ హిట్ అయిన మ్యాడ్, మ్యాడ్ స్కైర్ చిత్రాలతో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు.

సంగీత్ శోభన్.. దివంగత డైరెక్టర్ శోభన్ తనయుడు అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వర్షం సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శోభన్ పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు చిన్న కుమారుడు సంగీత్ శోభన్ హీరోగా వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవలే మ్యాడ్ స్కైర్ సినిమాతో మరో హిట్ అందుకున్న సంగీత్ శోభన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ గురించి పర్సనల్ విషయాలు పంచుకున్నాడు. తన తండ్రి శోభన్ తెరకెక్కించిన మొదటి సినిమా బాబీ అని.. ఆ సమయంలోనే తాను మొదటిసారిగా మహేష్ బాబును కలిశానని.. అప్పుడు తనకు ఒక చాక్లెట్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

“మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకు నేను లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి మా నాన్న తీసిన వర్షం సినిమాకు అసోసియేట్ డైరెక్ట్ర. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్న్ షిప్ చేయాలి. దాంతో పాత కాంటాక్స్ వాడి మా అమ్మతో మాట్లాడించి నేను మహర్షి సినిమాకు పనిచేశాను. ఆ సినిమాలో కాలేజీ సీన్స్ అన్ని డెహ్రాడూన్ లో షూట్ చేశారు. నెలరోజులు డెహ్రాడూన్ లో ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాను. ఈ విషయం ఎవరికీ తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు సంగీత్ శోభన్.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *