Akkineni Heros: నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్.. ఈ అమ్మడు ఎవరంటే..

Akkineni Heros: నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్.. ఈ అమ్మడు ఎవరంటే..


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు హీరో నాగార్జున. దివంగత హీరో నాగేశ్వర రావు నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి… ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ప్రేమకథలైనా, మాస్ యాక్షన్ చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద నాగ్ సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో నాగ్. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇటు వరుస సినిమాలతో నాగార్జున బిజీగా ఉండగా.. ఆయన వారసులు సైతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తండేల్ సినిమాతో రికార్డ్ సృష్టించారు అక్కినేని నాగచైతన్య.

తండేల్ సినిమాతో నటుడిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు చైతూ. మరోవైపు హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు అఖిల్. కానీ కెరీర్ మొదటి నుంచి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్, చైతూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే. ఈ ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. అయితే నాగార్జునతో కలిసి మూవీ కాకుండా ఓ యాడ్ చేసింది పూజా. అలా ముగ్గురు అక్కినేని హీరోలతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *