Horoscope Today: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మే 21, 2025): మేష రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఆదాయపరంగా ఊహించని పురోగతి ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, రవి, కుజుల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. అనుకోకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు కొత్తగా అవకాశాలు, ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయపరంగా ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బాగా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కామవుతాయి. పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలనిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సామాజికంగా హోదా, స్థాయి పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు హ్యాపీగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని తేలికగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కూడా సంతృప్తికరంగా సాగి పోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. ఆదాయానికి లోటుండదు. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఊరట లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభించే అవకాశముంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. తండ్రి వైపు నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *