
పై ఫొటోలో డీగ్లామర్ లుక్ లో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు అప్సరసలా మెరిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా డీ గ్లామర్ లుక్ లోనే కనిపించింది. పై ఫొటో అదే. వరంగల్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ 2012లోనే ఓ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక రెండో సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ మాత్రం ఈ హీరోయిన్ కు అవకాశాలు క్యూ కట్టాయి. సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇదే క్రమంలో మళ్లీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ప్రస్తుతం అటు తెలుగు, ఇటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఆనంది.
ఆనంది తమిళంలో కాయల్ అనే ఓ లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటించింది. అందులో డీ గ్లామర్ లుక్ లో ఆనంది అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో తమిళంలో ఆమెకు కాయల్ ఆనంది అని పేరు పడిపోయింది. ఆ మధ్యన శివంగి అనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది ఆనంది.
ఆనంది డ్యాన్స్ వీడియో..
View this post on Instagram
భైరవం మూవీతో త్వరలో మన ముందుకు రానుంది ఆనంది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆనందితో పాటు అదితీ శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెడిషినల్ శారీలో..
View this post on Instagram
కాగా ఆనంది సోక్రటిస్ అనే కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ను వివాహం చేసుకుంది. 2021 వరంగల్ లో వీరి వివాహం జరిగింది.
భైరవం సినిమాలో ఆనంది..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.