పాలకూరలో విటమిన్ ఏతో పాటు విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 9 పుష్కలంగా లభిస్తాయి. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పాలకూరలో శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలు లభిస్తాయి. ఇవి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
ముఖ్యంగా పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను శక్తివంతంగా తయారు చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. పాలకూరలో ఉంటే పాలకూరలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటిని శక్తివంతంగా తయారుచేస్తాయి.
ముఖ్యంగా పాలకూరని 20 రోజుల పాటు అల్పాహారంలో భాగంగా చేర్చుకుంటే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలకూరను ఇలా తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా సులభంగా తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ కూడా పుష్కలంగా పెరుగుతుంది.
కొంతమందిలో పాలకూర తినడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలకూరలోని విటమిన్ A, C చర్మంతో పాటు జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొంతమందిలో ఇలా 20 రోజుల పాటు పాలకూర తినడం వల్ల శరీర బరువును కూడా సులభంగా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు అల్పాహారం పాలకూర చేర్చుకొని వారు..ఒక రోజుకు బదులు మరొక రోజు కూడా చేర్చుకోవచ్చు.