దిన ఫలాలు (మే 24, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యో గాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఎటువంటి ప్రయ త్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు, రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం సజావుగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. మిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను, అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్ది పాటి పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సహోద్యోగులతో పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక పరిస్థితి కాస్తంత అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ధన పరంగా ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఒకరిద్దరు బంధు మిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో వృద్ది చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్నిహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయానికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తలపెట్టిన పనులు, వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా పనిభారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంటా బయటాగౌరవమర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి.. ముఖ్యమైన వ్యవహారాల్ని తేలికగా పూర్తి చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.