Horoscope Today: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మే 28, 2025): మేష రాశి వారు ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శుభ గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. బంధుమిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పురోగమిస్తాయి నిరుద్యోగులకు ఒక శుభవార్త అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం నిలకడగా సాగిపోతుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరో గ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పిల్లలు వృద్ధి లోకి వస్తారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. సహోద్యోగుల నుంచి ఇబ్బందులుండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల విశ్రాంతి కరువవుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనుల్ని హుషారుగా, ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో నిలకడగా వ్యవహరించడం మంచిది. తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల నష్టపోతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగి పోతాయి. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ధనపరంగా ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్ది మార్పులు ప్రవేశపెడతారు. వృత్తి జీవితం సానుకూలంగా పురోగమిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *