బాలీవుడ్ అందాల భామ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. హిందీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇప్పటికే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది కొద్దిసేపే అయినా తన నటనతో ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. ఇక ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను పెళ్లాడిన అలియా.. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అలియా తన అభిమాన నటుడు ఎవరో తెలిపింది. అంతే కాదు అతనితో సినిమా చేయడనికి ఈగర్ గా ఎదురుచూస్తున్నా అని తెలిపింది
అలియా భట్ ఇటీవలే కేన్స్‌లో లో మురిసింది. తన అందంతో కేన్స్‌లో రెడ్ కార్పెట్ పై హంసల హొయలు ఒకలబోసింది అలియా.. కాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ.. తన అభిమాన నటుల గురించి తెలిపింది. ఈ క్రమంలోనే తనకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఫహద్ తాను ఆరాధించే నటుల్లో ఒకరని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. అలాగే ..
ఫహద్ నటించిన సినిమాల్లో ఆవేశం సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలుపుతూ.. అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో కలిసి నటిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆస్వాదిస్తున్నారు. చిత్రపరిశ్రమలు అన్ని ఒకే యూనిట్ అని నేను కరోనా సమయంలో తెలుసుకున్నా అని చెప్పుకొచ్చింది అలియా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.