Horoscope Today: వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మే 29, 2025): మేష రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశముంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. అనవసర పరిచయాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కొందరు మిత్రులు మిమ్మల్ని తమ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం అంచనాలను మించుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయట పడతారు. ముఖ్య మైన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని తేలికగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫలం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహకారం తీసుకోవడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో మీ సమర్థతకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. శుభ కార్యాల్లో బంధువులకు బాగా సహాయపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శు‍భవార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అధికారులు బాగా ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా యాక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతి ఫలం పొందుతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ ‍సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదాలకు దిగవద్దు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *