Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..


శరీరంలో ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరిగా అవసరం. అంతేకాదు.. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కాల్షియం తప్పనిసరి. వయసుకు తగినట్లుగా కండరాలు కదలడానికి, ఎముకల సాంద్రతను, వాటిలో బలాన్ని కాపాడడంలోనూ కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మీ మెదడు నుంచి శరీరంలోని ప్రతి భాగానికి సందేశాలను తీసుకువెళ్లడానికి నరాలకు కాల్షియం అవసరం. రక్త నాళాలు మీ శరీరం అంతటా రక్తాన్ని తరలించడంలో కాల్షియం సహాయపడుతుంది, మీ శరీరంలోని అనేక విధులను ప్రభావితం చేసే హార్మోన్లను విడుదల చేయడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాల్షియం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలేంటో తెలుసుకోవటం తప్పనిసరి అంటున్నాన్నారు ఆరోగ్య నిపుణులు. పాలు, ఖర్జూరంలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే….

మీరు తరచుగా జీర్ణ సమస్యతో బాధపడుతుంటే, రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగండి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డతాయి. ఖర్జూరం పాలు తాగడం వల్ల నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో ఐరన్, విటమిన్ సి, డి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

బరువు పెరగాలనుకునే వారు ఖర్జూరాలను పాలలో నానబెట్టి, రాత్రి పడుకునే ముందు తాగడం మంచిది. ఖర్జూరంలో కేలరీలు, పోషకాలు అధికంగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి తోడ్పడతాయి. పాలలో ఖర్జూరం కలపడం వల్ల కండరాలకు మంచి పోషకాలు అందుతాయి. ఖర్జూరంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్ కండరాల నిర్మాణానికి, దృఢంగా ఉండటానికి సహాయపడుతాయి. బిపిని నియంత్రించడానికి పాలలో ఖర్జూరం కలిపి తాగండి. ఎందుకంటే వాటిలో మంచి పొటాషియం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *