అదే పాము పుట్టలు ఉన్న చోట కాలు కూడా పెట్టం. పాములంటే మనుషులకు చచ్చేంత భయం. అదే నాగుల చవితి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటాం. పుట్టలెక్కడున్నాయా? అని వెతికి మరీ పాలు పోస్తాం. హిందూ సాంప్రదాయంలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి దేవాలయంలోనూ నాగ దేవతకు సంబంధించిన విగ్రహాలు, పుట్టలు కనిపిస్తాయి. కొందరు వాటిని కులదైవాలుగా కొలుస్తారు. అయితే సినిమాలు, సీరియళ్ల ప్రభావమో.., లేక మానసిస్థితి బాగోలేకనో ఒడిశా రాష్ట్రంలో ఓ యువతి పాములా వింతగా ప్రవర్తించింది. మయూర్‌భంజ్ జిల్లా చక్కపాల్ గ్రామంలో మీనాక్షి అనే యువతి పాములా బుసలు కొడుతూ నేలమీద మెలికలు తిరిగింది. అసలేం జరిగిందంటే.. మీనాక్షి ఇంట్లోకి ఓ పాము వచ్చింది. అది గమనించిన ఆమె తండ్రి కుటుంబసభ్యుల్ని అలర్ట్ చేసారు. స్నేక్ హెల్ప్‌లైన్‌కి సమాచారం ఇచ్చారు. కాసేపటికి స్నేక్ క్యాచర్లు ఇంటికొచ్చారు. పామును బంధించే ప్రయత్నంలో వారున్నారు. అంతలో అక్కడే ఉన్న మీనాక్షి కింద పడి అచ్చం పాములా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను తీసుకెళ్లకండి నేను రాను ఇక్కడే ఉంటాను. నన్ను చంపకండి అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేసింది. ఊహించని ఘటన చూసి గ్రామస్తులు, స్నేక్ క్యాచర్లు షాక్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయుష్షు గట్టిది అంటే ఇదే.. పెను ప్రమాదంలో కూడా
పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆడిన కాకి.. వీడియో వైరల్
103 ఏళ్ల బామ్మ మేకప్ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్
లాటరీలో వచ్చిన రూ.30 కోట్లు ప్రియురాలి అకౌంట్లో వేశాడు.. మరుక్షణం ఆమె
ఈ యువకుడి ఐడియాను మెచ్చుకోకుండా ఉండలేరు..