దిన ఫలాలు (జూన్ 13, 2025): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశివారికి రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మదుపులు, పెట్టుబడుల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులకు విజయాలు సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తయి ఊరట కలుగుతుంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసు కోవడం మంచిది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. బంధువుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆదాయానికి లోటుండదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు బాగా లాభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటారు. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్య క్రమాలు సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రాంత బంధువులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ముఖ్య మైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక వ్యవహారాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.